నోరు జారిన వెంకయ్య: ఏడ్చేసిన మహిళా ఎంపీ

వెంకయ్య నాయుడు ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రభా ఠాకూర్ - 'పుర్తి గ్రూప్‌లో బీజేపీ అధ్యక్షుడు గడ్కరీకి పెట్టుబడులు ఉన్నాయి కదా!' అని అన్నారు. దీంతో వెంకయ్య నాయుడు అమెపై కఠినమైన వ్యాఖ్య చేశారు. దాంతో ప్రభా ఠాకూర్ నిశ్చేష్టురాలై కంటతడి పెట్టారు. వెంకయ్య వ్యాఖ్యపై రేణుకా చౌదరి, వి.హనుమంతరావు ఇతర కాంగ్రెస్ సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు.
తమ సభ్యురాలిని అభ్యంతరకర భాషలో దూషించడంపై క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అధికార పక్ష సభ్యులంతా నిరసనకు దిగడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ సందర్భంగా లాబీల్లో ప్రభా ఠాకూర్‌ను వెంకయ్య కలిశారు. ఆమెకు క్షమాపణలు చెప్పారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెసు సభ్యులు వెంకయ్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యకు ప్రభా ఠాకూర్ బాధపడితే తాను తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను కావాలని ఆ వ్యాఖ్య చేయలేదని వెంకయ్య నాయుడు అన్నారు. వేడిలో మాత్రమే తాను ఆ మాట అన్నానని ఆయన చెప్పారు. దీంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది.
వెంకయ్య తీరును కురియన్ మెచ్చుకున్నారు. "ఏ సభ్యుడికైనా క్షమాపణ చెప్పాలని ఏ సభ్యుడినీ అధ్యక్షస్థానం ఆదేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్య వైఖరి ప్రశంసనీయం'' అని అన్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications