'జయలలిత పెళ్లి చేసుకోకపోవడం వల్లనే అలా...'

జయలలిత అలా ఉండడానికి గల కారణం పెళ్లి చేసుకోకపోవడమే అన్నారు. జయలలిత వైఖరి అసాధరణమని, ఆమె తమిళనాడులో ఎప్పుడైతే అధికారంలో ఉంటుందో అప్పుడు కర్నాటక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
జయలలిత కేవలం ఒకవైపే ఆలోచించకుండా కర్నాటక రాష్ట్ర సమస్యల పైన కూడా ఆలోచించాలని హితవు పలికారు. నీళ్లు లేక గత రెండేళ్లుగా కర్నాటక కరువు ఎదుర్కొంటుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. జయలలిత కంటే తమిళనాడు ప్రతిపక్ష నేత, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి హేతుబద్దమైన వ్యక్తి అన్నారు.
సిద్దరామయ్య వ్యాఖ్యలకు మద్దతుగా జెడి(ఎస్) నేత పుత్తరాజు మాట్లాడుతూ... జయలలిత మాండ్యా జిల్లాలోని మెల్కొటేలే జన్మించారని, తాను పుట్టిన గడ్డను ఇప్పటి వరకు ఆమె సందర్శించలేదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications