నగరంలో అక్రమ బంగ్లాదేశ్ సెక్స్ రాకెట్ ముఠా, అరెస్ట్

బంగ్లాదేశ్‌కు చెందిన రోమా అనే ఇరవై ఎనిమిదేళ్ల మహిళ ఎనిమిదేళ్ల క్రితం అక్రంగా భారత్‌లోకి వచ్చింది. తన భర్తతో పాటు ఆమె వచ్చింది. కొద్ది రోజులు భార్యాభర్తలు పశ్చిమ బెంగాల్‌లో జీవనం సాగించారు. అక్కడ పాయల్ అనే వ్యక్తి వారికి పరిచయం అయ్యాడు. అతని సూచన మేరకు రోమా, ఆమె భర్త హైదరాబాద్‌కు వచ్చారు.
రాంనగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను అక్రమంగా నగరానికి తీసుకు వచ్చారు. వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరికి హుస్సేన్ అనే వ్యక్తి కూడా సహకరించాడు.
ఈ క్రమంలో చార్మినార్ ప్రాంతంలో మా క్లినిక్ పేరిట సెక్స్ సమస్యలకు వైద్య చేస్తామని నమ్మిస్తూ నకిలీ వైద్యుడు ఒకరు అక్కడకు వచ్చే వారిని ప్రేరేపించి రోమా వద్దకు పంపేవాడు. ఈ నేపథ్యంలో అక్రమంగా మానవ రవాణాతో పాటు వ్యభిచార కేంద్ర నిర్వహణపై కన్నేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications