ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం కోసం ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆతృతగా ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం ఏడాదిగా ఊరిస్తున్నారే తప్ప ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే విషయాన్ని చెప్పడం లేదు. సాధారణ ఎన్నికలకు ముందే వస్తానని, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్నప్పటికీ ఇంకా ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలు మరెంతో దూరం లేనందున ఎప్పుడు పూర్తి సమయం రాజకీయాలకు వినియోగిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు టిడిపి క్యాడర్, అభిమానులు. సంవత్సరం నుండి ఆయన త్వరలో వస్తానని చెబుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా వచ్చి కనిపించి అలా రెండు మాటలు మాట్లాడి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆయన వచ్చినప్పుడు క్యాడర్‌లో ఎంత ఉత్సాహం తొణికిసలాడుతోందో.. ఆ తర్వాత ఎప్పుడొస్తారనే అంశం పైనా అంతే చర్చ సాగుతోంది.

 ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

జూనియర్ ఎన్టీఆర్ అంశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడే బాలయ్య బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానని చెబుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

 ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇష్యూలు జరిగినప్పుడు బాలయ్య బయటకు వచ్చి మాట్లాడారు.

 ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కొడాలి నానిని గుడివాడ నియోజకవర్గానికి వెళ్లి మరీ బాలయ్య హెచ్చరించారు.

 ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగినప్పుడు కూడా బాలకృష్ణ ధీటుగానే స్పందించారు.

 ఊరిస్తూనే..: 'జూ ఎన్టీఆర్'తోనే బయటకు బాలయ్య!

నాని, వల్లభనేనిల వెనుక తాను ఉన్నాననడం, టిడిపి క్యాడర్, బాలయ్య, చంద్రబాబులు స్పందించడంతో జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల పలు సందర్భాలలో బాలయ్య బయటకు వచ్చి తాను వస్తున్నానని చెబుతున్నారు. అయితే ఆయన వచ్చిన సందర్భాలు గమనిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ అంశం తెరపైకి వచ్చినప్పుడే ఎక్కువ సందర్భాలు బయటకు వచ్చారనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం జరిగినప్పుడు, ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగినప్పుడు మాత్రమే బాలయ్య ఎక్కువగా బయటకు వస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+