జగన్ పార్టీలో మాటకారులు, ఎవరినైనా సరే...

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మాటకారులు చాలా మందే ఉన్నారు. ఎదురు పార్టీలపై విమర్శల అస్త్రాలు సంధించడం, ఎదుటివారి విమర్శలను మాటల తూటాలతో ఎదుర్కోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనిపిస్తుంది. నిరంతరం వారు తమ ప్రత్యర్థులపై ఒకరు కాకపోతే మరొకరు మాటల యుద్ధం చేస్తూనే ఉంటారు.

కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటివారు కాకుండా నిరంతరం మాటలతోనే ఎదుటివారిపై యుద్ధాన్ని ప్రకటించే సేన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉంది. ప్రత్యేకమైన సందర్భాల్లో సోమయాజులు వంటి నాయకులు బయటకు వస్తారు గానీ తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను తెగ తిట్టిపోయడానికి వీరు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు.

అంబటి రాంబాబు

అంబటి రాంబాబు మొదటి నుంచీ వైయస్ జగన్ వెంట ఉంటున్నారు. ఆయన పార్టీ అధికార ప్రతినిధి కూడా. చంద్రబాబుపై విరుచుకుపడడంలో ఆయన దిట్ట. వ్యంగ్యబాణాలు విసురుతూ మీడియా ప్రతినిధుల సమావేశంలో కూడా బహిరంగ సభలో మాట్లాడినట్లు పెద్దగా నోరు చేసుకుంటారు.

వాసిరెడ్డి పద్మ

రోజా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వాగ్బాణాలు విసరడంలో ఆమెది అందె వేసిన చేయి. ఎదుటివారిపై గుక్క తీప్పుకోకుండా విమర్శలు చేయగలరు. వాసిరెడ్డి పద్మ కూడా అంతే. ఈమె ఇంతకు ముందు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. అక్కడి నుంచి జగన్ పార్టీలోకి వచ్చారు.

గోనే ప్రకాశ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడడంలో గోనే ప్రకాశ రావు, రెహ్మాన్‌లది ప్రత్యేకమైన శైలి. ఆ సబ్జెక్టు దాదాపుగా వారిద్దరిదే. కెసిఆర్‌ను ఎన్ని రకాలుగా ఆడిపోసుకోవాలో అన్ని రకాలుగా గుక్క తిప్పుకోకుండా ఆడిపోసుకుంటారు.

గట్టు రామచందర్ రావు

గట్టు రామచందర్ రావుది ప్రత్యేకమైన శైలి. ఈయన కమ్యూనిస్టుగా ఉండి ప్రజారాజ్యంలోకి వెళ్లి, వైయస్సార్ చలువతో కాంగ్రెసు కండువా కప్పుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో స్థిరపడిపోయారు. ఆయన నోరు తెరిస్తే పదాలు ప్రవాహంలా జాలువారుతాయి. ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు కనిపిస్తారు.

బాజిరెడ్డి గోవర్దన్

బాజిరెడ్డి గోవర్దన్ మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి మనిషి. ఆయన వ్యాఖ్యలు పదనుగా ఉంటాయి. ఎదుటివారికి సవాల్ విసురుతున్నట్లుగా ఉంటాయి.

జూపూడి ప్రభాకర రావు

జూపూడి ప్రభాకర రావు వామపక్ష విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కార్యకారణ సంబంధాలను చూపిస్తూ వాదించే విధంగా ఆయన మాటలుంటాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాన్ని కొండంతగా చూపించగల సామర్థ్యం ఆయనకు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+