పని మనిషికి అశ్లీల చిత్రాలు: ఓ వృద్ధుడి నిర్వాకం

Hyderabad
హైదరాబాద్: ఓ వ్యక్తి పనిమనిషికి అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారం చేయబోయిన సంఘటన హైదరాబాదులో జరిగింది. కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. కెపిహెచ్‌పి కాలనీ భగత్‌సింగ్ నగర్ కాలనీ ఫేజ్-2లో ఉంటున్న బసవరాజు అనే అరవయ్యేళ్ల వ్యక్తి ఇంట్లో విశాఖ జిల్లాకు చెందిన సంధ్య, సాయికృష్ణలు పని చేస్తున్నారు. సంధ్యకు 21 ఏళ్లు. వారు రెండు నెలలుగా బసవరాజు ఇంట్లో పని చేస్తున్నారు.

సాయికృష్ణ వాచ్‌మన్ కమ్ డ్రైవర్‌గా పని చేస్తుండగా సంధ్య ఇంట్లో వంట పని చేస్తోంది. సోమవారం ఎవరూ లేని సమయంలో సంధ్యను పిలిచిన బసవరాజు ల్యాప్‌టాప్‌లో అశ్లీల చిత్రాలు చూపించబోయాడు. ఆమె వద్దని చెప్పి గదిలోనుండి వచ్చే ప్రయత్నం చేయగా బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అతని నుండి తప్పించుకొని పారిపోయింది.

ఆ తర్వాత సంధ్యను పిలిచి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, డబ్బిస్తానని చెప్పాడు. బాధితురాలు భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బసవరాజు వారిని తక్కవ జీతానికే పనికి కుదుర్చుకున్నారని రజక సంఘం ఆరోపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+