ఇంటికే జవాబు పత్రాలు: జెఎన్టీయులో భారీ కుంభకోణం

అరెస్టయిన వారిలో జెఎన్టీయు సిబ్బంది కూడా ఉన్నారు. బాలు మహేందర్, జయేందర్ రెడ్డిలకు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. జెఎన్టీయు హైదరాబాద్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ అవకతవకలు బయటపడ్డాయి. ఇంటివద్దే విద్యార్థులచే పరీక్షలు రాయించి పరీక్షల సమయంలో వాటిని జత చేస్తున్నారు. జయరాం, బాలులు జెఎన్టీయు జవాబు పత్రాల ఇంచార్జులుగా ఉన్నారు.
జెఎన్టీయు స్కాం పైన రిజిస్ట్రార్ స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లుగా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో కళాశాలల ప్రమేయం ఉంటే తాము గుర్తింపు రద్దు చేస్తామని చెప్పారు.
కాగా చండీగఢ్ మెడికల్ పిజి ఎంట్రన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ వ్యవహారంలో కూడా కొద్ది రోజుల క్రితం బయటపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి టాలీవుడ్ నిర్మాతను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. వైద్య విద్యా సంస్థల్లో చండీగఢ్ పిజిఐఎంఈఆర్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పిజిఐలోని వివిధ విభాగాల్లో పిజి వైద్య కోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్‌కు పాల్పడుతూ చండీగఢ్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వారు దొరికిపోయారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశవ్యాప్తంగా కాపీయింగ్‌కు పాల్పడుతున్న పెద్ద ముఠాను అప్పుడు సిబిఐ అరెస్టు చేసింది. ఏడుగురు మహిళా వైద్యులతో సహా మొత్తం 17 మందిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురు వైద్యులు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏడు వేలమంది హాజరవుతున్నారు. సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు ఈ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. నాలుగు కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులు వారికి చిక్కారు.












Click it and Unblock the Notifications