ఇంట్లోకి చొచ్చుకెళ్లి అమ్మాయి గొంతుకోసిన ప్రేమోన్మాది

Teen stabbed in front of parents
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని బికాం విద్యార్థిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నంకు చందిన బాలరాజ్, భాగ్యలతల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె నిఖిత బికాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సిఏ కోచింగ్ తీసుకుంటోంది. బుధవారం ఇంట్లో చదువుకుంటున్న సమయంలో రాఘవేందర్ రెడ్డి అనే యువకుడు ఆమె ఇంట్లోకి వచ్చి ఆమె గొంతు కొసి చెప్పాడు.

రాఘవేందర్ రెడ్డిది కందుకూరు మండలం దాసర్లపల్లి. ఇతని వయస్సు 27. సాయంత్రం నిఖిత తన ఇంట్లో చదువుకుంటుండగా తల్లి భాగ్యలత కూరగాయల కోసం బయటకు వెళ్లారు. తండ్రి బాలరాజ్ దుకాణంలో ఉన్నాడు. ఆ సమయంలో రాఘవేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి పడక గదిలో చదువుకుంటున్న నిఖితను కత్తితో గొంతుకోసి చంపాడు. ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు ఎంతకూ తలుపు తీయక పోవడంతో బలవంతంగా తీశారు.

నిఖితను తాను హత్య చేయలేదని అరుస్తూ రాఘవేందర్ రెడ్డి ఆమె తల్లిని నెట్టేసి బయటకు వచ్చాడు. తన వద్ద ఉన్న కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని ఇబ్రహీంపట్నంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిఖితను హత్య చేసిన రాఘవేందర్ రెడ్డి కొన్నాళ్లుగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

నిఖిత కుటుంబ సభ్యులు సైదాబాదు ప్రాంతంలో ఉన్నప్పుడు వీరి ఇంటి పక్కనే రాఘవేందర్ రెడ్డి కుటుంబం ఉండేది. అప్పట్లో అతను ప్రేమ పేరుతో నిఖిలను వేధించాడు. మూడేళ్ల క్రితం బాలరాజు ఇబ్రహీంపట్నంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడకు మారిపోయాడు. దీంతో రాఘవేందర్ రెడ్డి అక్కడకు కూడా వెళ్లి ఆమెను వెంటాడేవాడు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి వచ్చి ఆమెను హత్య చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+