హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిసార్టులో అశ్లీలకలాపాలు: పట్టుబడ్డ జంట, పారిపోతూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: నగరంలో అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ రిసార్టు పైన పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగులోని ఓ రిసార్టులో కొన్నాళ్లుగా అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు ఈ హైటెక్ వ్యభిచారాన్ని గురువారం రట్టు చేశారు. రిసార్టులోని గదుల్లో నాలుగు జంటలు శృంగార కార్యకలాపాల్లో మునిగాయి.

పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆ నాలుగు జంటలు అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి. మూడు జంటలు పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నాయి. ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యువతి గోడ మీదకు ఎక్కే ప్రయత్నంలో కిందకు జారి పడింది. దీంతో ఆమె కాలుకు గాయమైంది. ఆమెతో పాటు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ రిసార్టులో కొన్నాళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా వస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. రిసార్టు యాజమాన్యం వారి నుండి ఒక్కో గదికి ఒక్కో రోజుకు రూ.1400ల నుండి రూ.1600 వరకు తీసుకుంటున్నట్లుగా సమాచారం. సంఘటన స్థలంలో పోలీసులు కండోమ్స్, ఐపిల్స్, బీరు పాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా రాజధానిలో వ్యభిచార రాకెట్ ముఠా ఒకదానిని పోలీసులు రెండు రోజుల క్రితం రట్టు చేసిన విషయం తెలిసిందే. నగరంలో అక్రమంగా స్థిరపడి వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. ఆరుగురు బంగ్లాదేశీయులు సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Two youth arrested by Hyderabad police on Thursday in Narsing police station area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X