పటేళ్లే కీలకం: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్‌లో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‍లలోని 87 సీట్లకు నేడు తొలి దశ పోలింగ్ జరిగింది. గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలు ఉండగా ఈ రోజు 87 స్థానాలలో పోలింగ్ జరిగింది. తొలి దశ పోలింగులో 1.81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సౌరాష్ట్రలోని 48, దక్షిణ గుజరాత్‌లోని 35, అహ్మదాబాద్ నగరంలోని 4 నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది.
మొదటి దశ పోలింగ్ 55 నుండి 60 శాతం జరిగింది. ఉదయం పదకొండు గంటల వరకు 18 శాతం ఓటింగ్ జరగగా ఆ తర్వాత రెండు గంటలలో 38 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 53 శాతం ఓటింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ పటేల్‌లు అధికంగా ఉండే దక్షిణ గుజరాత్‌లో జరిగింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సిఎం మోడీతో విభేదించి కొత్త పార్టీ పెట్టడం ద్వారా బిజెపి ఓట్లను కొల్లగొట్టారు.

అయితే కేశూభాయ్ పటేల్ ప్రభావం పడకుండా నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా అదే సమాజిక వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అమిన్ పటేల్‌ను బిజెపి వైపుకు ఆకర్షించారు. ఇటీవలే అమిన్ పటేల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వరమయంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కేశూభాయ్ ద్వారా పోయే పటేల్ ఓట్లను తన వైపుకు తిరిగి మళ్లించుకునే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications