Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్‌వైపు కాసాని: 20మంది కార్పోరేటర్లకు వల

Kasani Gyaneshwar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెలంగాణ ప్రాంతం నుండి వలసల జోరు క్రమంగా పెరుగుతోంది. ముదిరాజ్ సంఘం నేత, మాజీ శాసనసభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ త్వరలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాసాని పాపులర్ బిసి నేత. రియల్ ఎస్టేట్ బిజినెస్‌మెన్‌గా ఉన్న కాసాని 'ముదిరాజ్' కార్డ్ ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చారు. ముదిరాజ్ నేతగా పలు సమావేశాలు నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. కాసాని మన పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కలిసి పోటీకి దిగారు. కాసాని శాసనమండలి సభ్యుడిగా పని చేశారు. కీలక నేతగా ఎదిగిన కాసాని ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లో అంతగా కనిపించడం లేదు. తాజాగా ఆయన తిరిగి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకొని మంచి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట.

కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. కాలేరు రెండు రోజుల క్రితమే కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెసు పార్టీతో తెగతెంపులు చేసుకున్నారనే వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి.

కాలేరు వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున అంబర్‌పేట నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఆయన ఈ రోజు జగన్‌ను జైలులో కలిశారు. ఇప్పటికే నలుగురు కాంగ్రెసు పార్టీ కార్పోరేటర్లు, ఒక తెలుగుదేశం కార్పోరేటర్ జగన్ వైపుకు వెళ్లిపోయారు. మరో 15 నుండి 20 మంది వరకు ఇరు పార్టీల నుండి జగన్ పార్టీలలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కార్పేరేటర్లకు జగన్ పార్టీ ఎప్పటి నుండో గాలం వేస్తోందని అంటున్నారు. ఇరవైకి పైగా కార్పోరేటర్లు జగన్ బుట్టలో పడవచ్చునని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+