Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ 16 ఎంపి సీట్ల లిస్టు: సురేఖ, గుత్తా, కోమటిరెడ్డి?

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అంశం ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ దాదాపుగా ఖాయం చేశారని చెబుతున్న లోకసభ పార్టీ అభ్యర్థుల జాబితాలో వారిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును, నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును జగన్ దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

YS Jagan

వైయస్ జగన్ 16 లోకసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కడప లోకసభ స్థానం అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి పేరు ఖరారైనట్లు చెబుతున్నారు. రాజంపేట నుంచి కాంగ్రెసు శాసనసభ్యుడి కుమారుడు మిథున్ రెడ్డి పేరును ఖాయం చేసినట్లు చెబుతున్నారు. నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి, తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపి కె. శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది.

సిట్టింగ్ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మళ్లీ నెల్లూరు నుంచి పోటీ చేస్తారు. అలాగే, మచిలీపట్నం నుంచి కుక్కల నాగేశ్వర రావు (మాజీ జిల్లా పరిషత్ చైర్మన్), మాజీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. బాలశౌరి గుంటూరు నుంచి పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. నర్సారావుపేట నుంచి రాంకీ అయోధ్యా రెడ్డిని పోటీకి దించాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నారట.

ఖమ్మం లోకసభ స్థానం నుంచి జలగం వెంకటరావును గానీ కొండా సురేఖను గానీ పోటీకి పెట్లాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి మాజీ రాష్ట్ర మంత్రి టి. జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా పోటీకి దిగుతారని చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి కె. గంగారెడ్డిని గానీ, బాజిరెడ్డి గోవర్ధన్‌ను గానీ పోటీకి పెట్టాలని ఆయన అనుకుంటున్నారని అంటున్నారు. కాకినాడ నియోజకవర్గం లోకసభ టికెట్ చెలమసెట్టి సునీల్‌కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏవైనా అవాంతరాలు వస్తే తప్ప ఈ జాబితా మారదనే ప్రచారం కూడా సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+