టిడిపి ఆఫీస్‌కు బైరెడ్డి: ఎన్టీఆర్ పాదాల చెంత లేఖ

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తరహాలో తమకు కూడా అఖిల పక్షంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బైరెడ్డి స్వర్గీయ పార్టీ కార్యాలయంలోని నందమూరి తారక రామారావు విగ్రహం పాదాల వద్ద విజ్ఞాపన లేఖ పెట్టారు. ఎన్టీఆర్ రాయలసీమ దత్తపుత్రుడు అని అందుకే ఆయన పాదాల వద్ద పెట్టానన్నారు. ఎన్టీఆర్ స్వయంగా తాను సీమ దత్తపుత్రుడినని చెప్పుకున్నారన్నారు.
అఖిల పక్షంలో పరిష్కారం దొరకదు
ఈ నెల 28న జరగనున్న అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకోవడం భ్రమే అవుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వేరుగా మెదక్ జిల్లాలో అన్నారు. కొందరు నేతలు తెలంగాణ అంశాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. కెసిఆర్ మెదక్ నుండి పోటీ చేస్తే ఓడగొట్టడం ఖాయమన్నారు.
మోసపూరిత హామీలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గారడీలు చేసే వారికి కెసిఆర్‌కు పెద్దగా తేడా లేదన్నారు. తెలంగాణ వస్తే అంటూ కెసిఆర్ మోసపూరిత హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications