శబరిమల యాత్రకు మోపిదేవికి కోర్టు అనుమతి

తన యాత్ర వివరాలను సిబిఐకి ముందే తెలియజేయాలని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. అదే విధంగా, యాత్రలో సిబిఐ కానిస్టేబుల్ ఒకరు మోపిదేవి ఉండాలని సూచించింది. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. దానికితోడు, 25 రూపాయలేసి రెండు పూచీకత్తులు తమకు సమర్పించాలని కూడా కోర్టు ఆయనకు షరతు పెట్టింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇటీవల మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అయ్యప్ప మాల వేశానని, శబరికి వెళ్లేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
తాను పందొమ్మిదేళ్లుగా అయ్యప్ప మాలను యధావిధిగా వేస్తున్నానని, అలాగే ఈసారి వేశానని, శబరికి వెళతానని అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు తనకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
వైఆబ్కారీ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు మే 24వ తేదీన అరెస్టు చేశారు. వాన్‌పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్‌పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications