సీమను కలపొద్దు: జెసి, కోదండ రాజీనామా చేసి... గాదె

దీనికి స్పందించిన బొత్స... ఈ విషయాన్ని లేఖ రూపంలో రాస్తే తాను అధిష్టానానికి పంపిస్తానని చెప్పారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ.. అఖిల పక్ష సమావేశానికి మూడు ప్రాంతాల ప్రతినిధులను పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలున్నాయని, రాయలసీమ అందులో భాగమేనని గుర్తించాలన్నారు. తమ ప్రాంతం నుండి కూడా ఓ ప్రతినిధిని పంపిస్తే సంతోషిస్తామన్నారు. ఈ అంశంపై తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని చెప్పారు.
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 28న జరగనున్న అఖిల పక్ష సమావేశానికి వెళ్లాలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సమావేశానికి ఎలా వెళతారని ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రతినిధులను పంపాలని కోరటంలో ఎలాంటి తప్పులేదని గాదె అన్నారు.












Click it and Unblock the Notifications