తగ్గేది లేదన్న కొండా సురేఖ: చూసుకుందామన్న ఈటెల

తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు అండగా ఉండేందుకు తన పట్ల కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు వెళ్లారన్నారు. తెరాస వాళ్లే తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. వారు రెచ్చగొట్టి రౌడీయిజం చేసి మమ్మల్ని అంటే ఎలా అన్నారు. మా ఇంటిపై దాడి చేసి దిష్టి బొమ్మ తగులబెట్టినప్పుడు లేని తప్పు మీ కార్యాలయానికి వచ్చి కెసిఆర్ దిష్టి బొమ్మ తగులబెడితే తప్పేంటన్నారు.
రౌడీయిజాన్ని ఎవరు ప్రారంభించారో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ ఇస్తాం.. తెస్తాం.. అంటూ కెసిఆర్ పన్నెండేళ్లుగా ప్రజలను మభ్య పెడుతున్నారని, మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తమను విమర్శించే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదన్నారు. పరకాల ఎన్నికల సమయంలో మూడు నెలల్లో తెలంగాణ తీసుకు వస్తుందని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో కోట్లు సంపాదించారని మండిపడ్డారు.
వరంగల్ తెరాస పార్టీ కార్యాలయం ఘటనపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకొని విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏం చేయాలో చూసుకుంటామన్నారు. తమ పార్టీ కార్యాలయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు యాక్షన్ తీసుకోకుంటే మేమే యాక్షన్ తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications