• search
 • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆత్మహత్య చేసుకుందాం, రా!: కెసిఆర్‌కు సురేఖ సవాల్

By Pratap
|
Konda Surekha
వరంగల్: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన సవాల్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ స్వీకరించారు. ఆత్మహత్య చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కెసిఆర్ కూడా అందుకు సిద్ధపడాలని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని ఆమె అన్నారు.

కెసిఆర్‌పై, తెరాసపై ఆమె నిప్పులు చెరిగారు. తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, కెసిఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ ముందు ఆత్మహత్య చేసుకుందామని ఆమె అన్నారు. తేదీని కెసిఆర్ నిర్ణయించాలని, ఏ తేదీన రమ్మంటే ఆ తేదీన కెసిఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.

అఖిలపక్ష సమావేశానికి ముందే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని, దీనికి భయపడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారేమో చూద్దామని ఆమె అన్నారు. ప్రస్తుత వివాదం తెలంగాణకు సంబంధించింది కాదని, ఇరు పార్టీలకు మధ్య నెలకొన్న వివాదమని ఆమె అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను కెసిఆర్ స్వప్రయోజనానికి వాడుకున్నారని ఆమె ఆరోపించారు. కెసిఆర్, తెరాస కారణంగానే తెలంగాణలో దాదాపు 800 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె అన్నారు.

తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కెసిఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఆమె అన్నారు. ఎండో సల్ఫాన్ తీసుకుని ఇద్దరం ఢిల్లీకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందామని ఆమె కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. చావులెక్కలు కడుతున్నారని కెసిఆర్ తన సవాల్‌ను స్వీకరించాలని ఆమె అన్నారు. తనను ఆ్మహత్య చేసుకోవాలని కెసిఆర్ కోరడాన్ని తాను స్వాగతిస్తున్నాననని ఆమె అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ మంగళవారంనాడు అంతకు ముందు అన్నారు. కెసిఆర్ పైన తాను చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునేది లేదని చెప్పారు. తన ఇంటి పైకి తెరాస కార్యకర్తలు వచ్చి దాడి చేసి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఇస్తాం.. తెస్తాం.. అంటూ కెసిఆర్ పన్నెండేళ్లుగా ప్రజలను మభ్య పెడుతున్నారని, మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తమను విమర్శించే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదన్నారు. పరకాల ఎన్నికల సమయంలో మూడు నెలల్లో తెలంగాణ తీసుకు వస్తుందని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో కోట్లు సంపాదించారని మండిపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

వరంగల్ యుద్ధ క్షేత్రం
 • Chinta Sambamurthy
  చింతా సాంబమూర్తి
  భారతీయ జనతా పార్టీ
 • Dommati Sambaiah
  దొమ్మాటి సాంబయ్య
  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

English summary
YSR Congress leader abd former minister Konda Surekha accepted Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao's challenge to commit suicide on Telangana issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3400340
CONG+84084
OTH1180118

Arunachal Pradesh

PartyLWT
BJP15015
CONG000
OTH202

Sikkim

PartyLWT
SDF606
SKM505
OTH000

Odisha

PartyLWT
BJD88088
BJP22022
OTH13013

Andhra Pradesh

PartyLWT
YSRCP1470147
TDP27027
OTH101

TRAILING

R Dhruvanarayan - INC
Chamarajanagar
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more