తెలంగాణ ఇవ్వడం కష్టమే: తేల్చలేమన్న వాయలార్!

ఈ సందర్భంగా పాల్వాయితో వాయలార్ తెలంగాణ అంశం తేల్చడం కష్టమని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం ప్రకటించడం కష్టమేనని, ఈ అంశాన్ని తేల్చడం సులభమైన విషయం కాదని, దానితో అనేక అంశాలు, సమస్యలు ముడిపడి ఉన్నాయని పాల్వాయితో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పాల్వాయి తెలంగాణ ఎంపీలకు చెప్పారని తెలుస్తోంది.
మొదట తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై తేల్చి చెప్పేలా ఒత్తిడి చేయాలని.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెబితే రాష్ట్రం ఇవ్వకుండా నాన్చడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ చెప్పారట. అయితే ఈ నెల 28వ తేది తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications