సురేఖపై కెసిఆర్: జగన్ పార్టీ వర్సెస్ టిఆర్ఎస్, ఉద్రిక్తం

Warangal Dist
వరంగల్/మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వరంగల్ జిల్లా నేత, మాజీ మంత్రి కొండా సురేఖపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలోని తెరాస కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెరాస భవనం వద్ద కొండా సురేఖ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

అనంతరం కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. దీనిని తెరాస అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీఛార్జ్ చేసి ఇరు పార్టీల నేతలను అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇరువర్గాలు మెట్టు దిగలేదు.

దీంతో పోలీసు అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కెసిఆర్ డౌన్ డౌన్, కొండా సురేఖ జిందాబాద్, జగన్ జిందాబాద్ అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనలో పలు కారు అద్దాలు పగిలాయి. తెరాస కార్యాలయ భవనం దగ్గర ఉన్న పలు దుకాణాలు, కార్యాలయాల అద్దాలు పగిలిపోయాయి.

హైదరాబాదులో..

హైదరాబాదులోని టిఆర్ఎస్ కార్యాలయం వద్ద జగన్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ పార్టీ కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి చల్లబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+