శ్రీవారికి మాల్యా 3 కిలోల బంగారం ప్రదానం

Vijay Mallya
తిరుపతి: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్, యుబి గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామికి బంగారం బిస్కట్లు ప్రదానం చేశారు. వాటి బరువు సుమారుగా మూడు కిలోలు ఉంటుందని అంచనా. తన 58వ జన్మదినం సందర్భంగా మాల్యా మంగళవారం తిరుపతి శ్రీవారి చెంతకు వచ్చారు.

శ్రీవారిని దర్శించుకుని ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన బంగారాన్ని ప్రదానం చేసి, దాన్ని పవిత్ర దేవస్థానం ద్వారాలకు బంగారు పూత వేయడానికి వాడాలని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాలం) చిన్నంగారి రమణ ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెపపారు.

తన కుటుంబ సభ్యులతో పాటు విజయ్ మాల్యా గత రాత్రి తిరుపతి వచ్చారు. తనకు 15 ఏళ్ల క్రితం వెంకట విజయం విరాళంగా ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహంలో తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.

విజయ్ మాల్యా ఆగస్టులో కర్ణాటకలోని దక్షిణ కననడ జిల్లాలో గల కుక్కె సుబ్రహ్మణ్య స్వామికి మాల్యా 80 లక్షల రూపాయల విలువ చేసే బంగారు రేకుల ద్వారాలను ప్రదానం చేశారు. మాల్యా 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఇది దేశీయ మార్కెట్ వాటాలో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+