విశ్వధర్‌లో కేశూభాయ్ పటేల్ లీడ్: మోడీ విజయం

Keshubhai Patel
గాంధీనగర్: గుజరాత్ పరివర్తన్ పార్టీ (జిపిపి) అధినేత కేశూభాయ్ పటేల్ విశ్వధర్‌లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు తన అభ్యర్థిని నిలబెట్టలేదు. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. కాగా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మణినగర్ నియోజకవర్గంలో సమీప కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్వేతా భట్‌పై 47 వేల మెజారిటీతో విజయం సాధించారు. బిజెపికి కూడా గుజరాత్‌లో విజయం ఖాయమైంది.

గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల బిజెపి నేత స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేసారు. జనగధ్‌లో కూడా జిపిపి అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. బిజెపికి పెట్టనికోటలుగా ఉంటూ వస్తున్న రాజ్‌కోట్‌, అమ్రేలీలో కాంగ్రెసు ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది బిజెపికి మంచి సంకేతం కాదని భావిస్తున్నారు.

నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్ షా నరన్‌పురాలో 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నారు. బిజెపి విజయాన్ని చూస్తే కాంగ్రెసును ప్రజలు తిరస్కరించారని చెప్పవచ్చునని బిజెపి నేత నిర్మలా సీతారామన్ అన్నారు.

కాంగ్రెసును వదిలేసి బిజెపిలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి నర్వహరి అమీన్ బిజెపి విజయం ఖాయమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+