హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలాగే గవర్నర్, ఇష్టమొచ్చినట్లు...: సిఎంపై డిఎల్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ వ్యవహారంపై శుక్రవారం మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేబినెట్ నిర్ణయంపై ఆయన ధ్వజమెత్తారు. నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని మంత్రివర్గం విచక్షణ లేకుండా పని చేస్తే ఎలా అన్నారు. ఎవరి పైన పడితే వారి పైన కేసులు ఎత్తి వేస్తారా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లుగా కేసులు ఎత్తి వేస్తే శాంతిభద్రతల పరిస్థితి ఏమిటని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.

ఈ విషయాలన్నింటినీ తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. వీటిని అధిష్టానమే చూసుకుంటుందన్నారు. ధర్మాన ప్రాసిక్యూషన్ అంశంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేబినెట్ పైన రుద్దటం ఏమిటన్నారు. మంత్రివర్గం విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ధర్మాన ఫైలు పైన తన లాగే గవర్నర్ నరసింహన్ కూడా సంతృప్తి చెందలేదని, అందుకే ఆమోదించకుండా తిప్పి పంపించారన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిందన్నారు. అన్ని విషయాలలో కేబినెట్ జోక్యం తగదన్నారు. సిబిఐ, కోర్టులు తప్పుపట్టినప్పటికీ ధర్మానను వెనుకేసుకు రావడం సరికాదన్నారు. ధర్మాన విషయంలో గవర్నర్ సూన ప్రభుత్వానికి ఇబ్బంది కరమే అని అన్నారు. మంత్రివర్గంలో తాను ఉన్నాను. కాబట్టే ఈ రకంగా స్పందించాల్సి వస్తోందన్నారు.

శ్రీలక్ష్మి పిటిషన్

కాగా తమిళనాడులోని వెల్లూరులు చికిత్స చేయించుకునేందుకు తాను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Minister DL Ravindra Reddy has targeted Chief Minister Kiran Kumar Reddy again on Friday. He has suggested ministers that don't interfere in all issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X