వైయస్ జగన్ కోసం జనం సంతకం: రాష్ట్రపతికి లేఖ

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విడుదల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వైయస్ జగన్‌ అరెస్టు, ఆయనపై కేసులు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ప్రజల సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించడానికి సిద్ధమవుతోంది. ఆ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శుక్రవారం శ్రీకారం చుట్టింది. కోటి మందితో సంతకాలు చేయించి, వినతిపత్రాన్ని ప్రణబ్ ముఖర్జీకి పంపించాలనేది పార్టీ ఉద్దేశ్యం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎస్టీ విభాగానికి చెందిన నేత రవీంద్ర నాయక్ దానిపై తొలి సంతకం చేశారు. ఈ జనం సంతకం కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. వైయస్ జగన్‌ను దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని, సిబిఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అధికార కాంగ్రెసు పార్టీని ధిక్కరించినందుకే వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు. వైయస్ జగన్‌పై రాజకీయపరంగా బనాయించిన కేసులను తాము తీవ్రంగా గర్హిస్తున్నామని, జగన్‌ను దోషిగా చూపడానికి సిబిఐ అహర్నిషలూ చేస్తున్న ప్రయత్నాలను పరాకాష్టగా భావిస్తున్నామని ఆ లేఖలో అన్నారు. జగన్‌ను 200 రోజులకు పైగా అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నామని వారన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విజ్ఢప్తి ఇది అని లేఖలో ప్రస్తావించారు.

ఇదిలావుంటే, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను లోటస్‌పాండులో కలిశారు. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని భేటీ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+