వేర్వేరు పెళ్లిళ్లు: అయినా అఫైర్, ప్రేమికుల ఆత్మహత్య

శివమ్మ రవి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. వేరు పడలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం సుబ్బరాయుడు దైనందిన కార్యక్రమంలో భాగంగా అడవికి వెళ్లిన సమయంలో అతని ఇంటికి వెళ్లారు. ఆత్మహత్యకు సినీమా ఫక్కీలో ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ప్రకారం రవి సుబ్బరాయుడు వదిలి వెళ్లిన నాటు తుపాకీలో గుండ్లతోపాటు మందుగుండు సామాను కూరాడు. ఒకరి వీపునకు ఒకరు ఆనుకుని నిలబడ్డారు. రవి తుపాకీ బారు తన గుండెకు ఎదురుగా వేలాడ దీసుకున్నాడు. ముందుగానే అమర్చిన కర్రతో ట్రిగ్గర్ నొక్కాడు.
తుపాకీలోని గుండు రవి గుండెను చీల్చి ఛిద్రం చేయడంతోపాటు శివమ్మ శరీరంలోకి దూసుకెళ్లింది. రవి అక్కడిక్కడే మృతి చెందగా శివమ్మ కుప్పకూలి పోయింది. ఇరుగు పొరుగువారి చొరవతో 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం అహోబిలంలో గురువారం జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది.
విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డసిఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ ఈశ్వరయ్య, పట్టణ ఎస్‌ఐ రమేష్‌బాబులు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.












Click it and Unblock the Notifications