వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ: గ్యాంగ్‌రేప్ తర్వాత నిందితులు ఏం చేశారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Delhi: What culprits did after gangrape, reveal police
న్యూఢిల్లీ: బస్సులో గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు 33 ఏళ్ల రాంసింగ్ నేరాన్ని అంగీకరించడంలో తన కిరాతకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారేం చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాంసింగ్‌కు తన మిత్ర బృందంలో మెంటల్ అనే పేరుంది. చట్టం నుంచి తప్పించుకోవడానికి అతను మాస్టర్ ప్లాన్ వేశాడు.

మొదట అతను ప్రతిదాన్నీ తోసిపుచ్చాడని, ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ప్రతి విషయాన్నీ వెల్లడించాడని, ఆ విషయాలు చెప్పుతున్నప్పుడు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తు బృందంలోని ఓ అధికారి చెప్పారు. ఆ కిరాతకం చేసిన తర్వాత కూడా అతనిలో అంతే క్రూరత్వం కనిపించిందని, సాక్ష్యాలు లభించకుండా బస్సును కడిగాడని, భయపడాల్సిన అవసరం లేదని, కొంత కాలం ఎక్కువగా బయటకు రాకుండా చూసుకుంటే సరిపోతుందని తన అనుచరులకు చెప్పాడని ఆయన వివరించారు.

బాధితురాలి దస్తులను, ఆమె స్నేహితుడి దుస్తులను విప్పేసి రక్తం మరకలను తొలగించే ప్రయత్నం చేశారని, వీర్యం మరకలు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. ఆరుగురు నిందితులు బాధితురాలి నుంచి, ఆమె మిత్రుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు కూడా లాక్కుని, వాటిని స్విచాఫ్ చేశారని అంటున్నారు.

నిందితుడి నుంచి మొబైల్స్‌ను, దుస్తులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మర్నాడే ఎప్పటి మాదిరిగానే పనులకు వెళ్లిపోయారని అంటున్నారు. తమ కీచకపర్వం మర్నాడు వార్తగా వచ్చేసరికి రాంసింగ్ బస్సును నడపడం ఆపేసి, దాన్ని నోయిడాలోని సెక్టార్ 62 సమీపానికి తీసుకుని వెళ్లి రక్తం లేకుండా కడిగేశాడని అంటున్నారు. పోలీసులు రాంసింగ్ ఉద్యోగి దినేష్ యాదవ్ సహాయంతో బస్సును తెప్పించే ప్రణాళిక వేశారు. రాంసింగ్ బస్సును నడుపుతూ వచ్చేలా దినేష్ యాదవ్‌కు పోలీసులు సూచనలు ఇచ్చారు.

బస్సు నడుపుకుంటూ రాంసింగ్ ఆర్కెపురం చేరుకోగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాంసింగ్‌తో పాటు మరో ఐదుగురు 23 ఏళ్ల వైద్య విద్యార్థిని రేప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఇదిలావుంటే, గ్యాంగ్‌రేప్‌నకు నిరసనగా రాష్ట్రపతి భవన్ వద్ద ప్రదర్శన జరిగింది. ఢిల్లీవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

English summary
33-year-old Ram Singh, the main accused of the infamous gangrape in Delhi, showed his shrewdness while confessing to the crime. Now, police recalled his statements revealing what he had done to cover their tracks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X