ఎవరు హీరో: ఎక్స్‌పీరియన్స్‌తో మోడీ: ఛాన్స్‌తో రాహుల్
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించడంతో ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రధాని అభ్యర్థిని ప్రకటించనప్పటికీ పార్టీలోని పలువురు నేతలు ఆయన ప్రధాని పదవికి అర్హుడు అని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెసు పార్టీలో ఇప్పటికే ప్రధాని అభ్యర్థి ఖరారయ్యారు! అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ రాహుల్ గాంధీయే 2014లో ప్రధాని అభ్యర్థి అని చెప్పవచ్చు.
బిజెపిలో మోడీ, కాంగ్రెసులో రాహుల్ వచ్చే ఎన్నికల ప్రధాని అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరిలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడి కింది స్థాయి నుండి అచెంలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. అంతేకాదు ఆ స్థాయిలో తనను తాను నిరూపించుకున్న మోడీ ప్రధాని అభ్యర్థి రేసులో అందరికంటే ముందున్నారు. ఇక రాహుల్ గాంధీ వారసత్వ నేత. ఆయన గాంధీ - నెహ్రూ కుటుంబ ఇమేజ్‌తో వచ్చిన వ్యక్తి.
రాహుల్, మోడీ రాజకీయ జీవితంలోని వ్యత్యాసాలు కనిపిస్తాయి. రాహుల్ ఫెయిల్యూర్ నేతగా పేరు తెచ్చుకుంటే, మోడి విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగారు. రాహుల్ ఎక్కడ ప్రచారం చేసినా గెలిచిన సందర్భాలు లేవు. దీంతో అతనికి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. ఇక మోడీ విజయాలే తప్ప అపజయాలు ఎరుగని నేత. కాంగ్రెసుతో పాటు బిజెపిపై అవినీతి విమర్శలు ఉన్నాయి. కానీ మోడీ పైన ఎలాంటి అవినీతి మచ్చ లేదు. అయితే రాహుల్ బావ రాబర్ట్ వాద్రా పైన భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ పదవి చేపట్టే అవకాశాలు వచ్చినప్పటికీ అనుభవం కావాలనే పేరిట దూరం వెళుతున్నారు. మోడీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. అవకాశాల్ని నిచ్చెనగా చేసుకొని ఎదిగారు. మోడీ అనుభవజ్ఞుడు. కానీ రాహల్ మాత్రం అనుభవం కావాలంటూ ఇంకా చేతులు కట్టుకొని కూర్చున్నారు! బిజెపి అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తుందనే అపవాదు ఉంది. కానీ మోడీ బిసి కావడం కలిసి వచ్చే అంశం. అదే సమయంలో రాహుల్ ఓసి నేత.

2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనప్పటికీ యూపిఏ అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఇప్పటికే తేలిపోయింది. ఎన్డియే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే గుజరాత్‌లో గెలుపు తర్వాత మోడీ అభ్యర్థిత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడు. అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గోద్రా వంటి అతి పెద్ద ఇష్యూను చూపించి తనను టార్గెట్‌గా పెట్టుకున్న విపక్షాలను ఎదుర్కొన్నాడు. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే గుజరాత్ మైనార్టీల తలసరి ఆదాయమే ఎక్కువ.

రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ నేతగా ముద్రపడ్డారు. ఆయన ప్రచారం చేసిన చోట గెలిచిన దాఖలాలు తక్కువ. ఆయనకు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. ఇంకా తల్లిచాటు బిడ్డగానే ఉన్నాడని చెప్పవచ్చు.

నరేంద్ర మోడీ కింది స్థాయి నుండి కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగి.. ముఖ్యమంత్రిగా నిరూపించుకొని ప్రధాని రేసులో నిలబడ్డ వ్యక్తి.

రాహుల్ గాంధీ వారసత్వ నేతగా తెర పైకి వచ్చాడు. గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ నేతగా ఆయన డైరెక్టుగా అందలం ఎక్కాలనుకుంటున్న వ్యక్తి.

రాహుల్ గాంధీని కాంగ్రెసు మాత్రమే కాదు. యూపిఏలోనూ ఆమోదయోగ్యమైన వ్యక్తి. వారసత్వం కారణంగా ఫెయిల్యూర్ నేత అయినప్పటికీ ఆయననే అందరూ ఆమోదిస్తారు.

మోడీకి ఇంటి పోరే ఎక్కువగా ఉంది. బిజెపిలోనూ, ఎన్డీయేలోను ఆయన ప్రధాని అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించే వారు ఉన్నారు.
గోద్రా అల్లర్లను మినహాయిస్తే నరేంద్ర మోడీని మించిన సెక్యులరిస్టు లేరనేది బిజెపి వాదన. గోద్రా అంశం కూడా కేవలం మోడిని టార్గెట్ చేసుకునేందుకు విపక్షాలు ఉపయోగించుకుంటున్న అంశం అని వారి వాదన. మోడీ మంచి సెక్యులరిస్ట్ అనేందుకు బిజెపి పలు విషయాలను చెబుతోంది. దేశంలో ఏ ముస్లింలకు లేని తలసరి ఆదాయం గుజరాత్‌లో ఉందని, నిన్న జరిగిన ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎనిమిదింటిలో మోడీకే పట్టం కట్టారని, మైనార్టీల పట్ల మోడీల చిత్తశుద్ధికి ఇవే నిదర్శనాలు అంటున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తమకు ఇబ్బందులు తప్పవనే ఆందోళనలో కాంగ్రెసు కూడా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications