Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ వైపు వెళ్తే భార్యలే ఓటెయ్యరు: దానం, సాక్షిపై ఫైర్

Danam Nagender
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే వారికి మొదట వారి భార్యలే ఓటేయరని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ శనివారం అన్నారు. షర్మిల కాలికి గాయం అయిందని తెలిసి మానవీయ కోణంలో ఆలోచించి ఆమెను తన సోదరి అని వ్యాఖ్యానించానని, అలా తాను చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా మైండ్ గేమ్ ఆడుతూ వక్రీకరించి ఎల్లో జర్నలిజం చేసిందని విమర్శించారు.

Recommended Video

    Vikram Hit List Movie Public Talk #VOX | Filmibeat Telugu

    వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే వారికి వారి భార్యలే ఓటు వేయరని, ఇంటి పక్క వారు కూడా ఓటు వేయరన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ నేత కాలేరు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారని విమర్శించారు. కొత్తగా వచ్చిన పార్టీలు వారి స్వార్థం కోసం, అవినీతిని కాపాడుకునేందుకే వచ్చాయని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.

    కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తనకు సోదరి లాంటిదని తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని దానం నాగేందర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. షర్మిల షర్మిల తన సోదరి అని అన్నందుకు రాద్ధాంతం చేశారని ఆయన అన్నారు. తాను పార్టీ ఫిరాయించబోనని, కాంగ్రెసులోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో దానం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

    వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని ఆయన చెప్పారు. షర్మిలను పరామర్శిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడని, వైయస్ తమ గుండెల్లో ఉంటారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యల్లో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని చెప్పారు. ఆ వ్యాఖ్యలతో దానం నాగేందర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి. మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. శనివారం వాటిని ఆయన కొట్టి పారేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+