మోడీ ప్రమాణానికి జయలలిత: ఆకాశానికెత్తిన వాషింగ్టన్

మూడోసారి తన గెలుపుతో మోడీ.. ప్రధాని అభ్యర్థి బరిలోకి ప్రవేశించారని వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురించిన వ్యాసంలో పేర్కొన్నారు. దేశంలో గాంధీ కుటుంబానికి ప్రత్యర్థిగా మోడీ అవతరిస్తున్నారని న్యూయార్క్‌టైమ్స్ వ్యాఖ్యానించింది. అమెరికా పత్రికలలో నరేంద్ర మోడీ విజయం వివిధ కథనాలు రావడం గమనార్హం.
మోడీ ప్రమాణ స్వీకారానికి జయలలిత
డిసెంబర్ 26వ తేదిన నరేంద్ర మోడీ నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదట 25వ తేది అని వార్తలు వచ్చినప్పటికీ 26న చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకానున్నారు.
నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా అధికార ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో జయలలిత గెలుపొంది.. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇప్పుడ మోడీ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications