లక్ష జరిమానా కడుతారా: శంకరన్నపై హైకోర్టు ఫైర్

పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు శంకరరావును ఆదేశించింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ విలాస్ వి. అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసన ఆ హెచ్చరిక చేసింది.
పిటిషన్‌కు అనుబంధంగా ఆధారాలను సమర్పించాలని పలుమార్లు సూచించినా శంకరరావు పట్టించుకోకపోవడంపై స్పందించిన హైకోర్టు లక్ష రూపాయల జరిమానా కట్టేందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించింది.
ఇదిలావుంటే, ఎర్రచందనం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టు ప్రభుత్వాన్ని సంజాయిషీ అడిగింది. దీనిపై సమాధానమిచ్చిన అడ్వొకేట్ జనరల్ - తమ వద్ద 2 వేల 6 వందల టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయని, టన్ను నాలుగున్నర లక్షల మేర వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరణ ఇచ్చారు.
ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు గ్లోబల్ టెండర్లూ కూడా పిలిచామని చెప్పారు. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications