వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసపై కడియం, మర్రి నిప్పులు: గ్యాంగ్‌రేప్‌పై టి-ఎంపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari - arri Shashidhar Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రను అడ్డుకునే దమ్ము తెలంగాణ రాష్ట్ర సమితికి లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి సోమవారం అన్నారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందే తెలంగాణపై కాంగ్రెసు వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెరాస, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తప్పుడు ఎత్తుల వల్లనే తెలంగాణ ఆలస్యమవుతోందన్నారు. ఈ నెల 27వ తేదిన కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి ఎవర్ని పంపాలనే అంశం ఈ భేటీలో బాబు నిర్ణయిస్తారన్నారు. బాబు యాత్రను అడ్డుకునే సీన్ తెరాసకు లేదన్నారు. పత్తికి మద్దతు ధర కోసం పత్తికి మద్దతు ధర కోసం జనవరి మొదటి వారంలో ఎనుమాముల మార్కెట్ యార్డులో బాబు దీక్ష చేయనున్నట్లు చెప్పారు.

అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం

తెలంగాణపై అన్ని పార్టీలు ఒకే విధమైన అభిప్రాయం చెప్పాలని పెద్దపల్లి ఎంపి జి.వివేక్ అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అఖిల పక్ష సమావేశానికి ముందే తన నిర్ణయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు స్ఫష్టత ఇస్తే కాంగ్రెసుపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారనే తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. మొన్న వరంగల్‌లో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ తగిలిందన్నారు.

గ్యాంగ్ రేపిస్టులను శిక్షించేందుకు చట్టంలో మార్పులు తేవాలని వివేక్ అభిప్రాయపడ్డారు. రేపిస్టులను మరింత కఠినంగా శిక్షించే చట్టం రావాలన్నారు. ఢిల్లీ సంఘటనను పార్లమెంటులో ప్రస్తావించి చట్టం వచ్చేలా సహకరిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాల సిలబస్ నుండే మహిళల పట్ల గౌరవంగా ఉండే సిలబస్‌ను ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

పోరాటే వారు రాష్ట్రం ఏర్పడ్డాక ఏం చేస్తారు

తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామంటున్న వారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఏం చేస్తారో చెప్పాలని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశానికి ఇద్దరు ప్రతినిధులను పంపే అవకాశముందని, దీనిని పిసిసి, అధిష్టానం కలిసి నిర్ణయిస్తుందన్నారు. ఎవర్ని పంపాలనే అంశంపై చర్చిస్తారన్నారు. తెలంగాణ సమస్యకు త్వరగా పరిష్కార మార్గం చూపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అభివృద్ధి కూడా అవసరమన్నారు.

కేంద్రం వైఖరి చెప్పాలి

అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై కేంద్రం తన వైఖరిని వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఈ బేటీలో ఒకే అభిప్రాయం చెప్పని పార్టీలతో కేంద్రమే ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

English summary

 Sanatnagar MLA Marri Shashidhar Reddy and TDP leader Kadiyam Srihari were lashed out at Telangana Rastra Samithi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X