వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాలకు సూపర్ స్టార్ కృష్ణ గుడ్‌బై: తీరని కోరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ సినిమాల నుంచి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని, దాంతో సినిమాల నుంచీ రాజకీయాల నుంచీ తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ గతంలో మాస్ హీరో. ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. తాను ఛత్రపతి శివాజీ సినిమాలో నటించాలని అనుకున్నానని, అయితే అది తీరని కోరికగానే ఉండిపోతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తాను ఛత్రపతి శివాజీ సినిమా తీయాలని అనుకున్నానని, నటనకు దూరంగా కావాలని నిర్ణయించుకోవడంతో అది స్వప్నంగానే మిగిలిపోతోందని అన్నారు.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనే మనసులు సినిమాతో సినీ రంగంలో ఆయన స్థానం పదిలమైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. పద్మ భూషణ్‌తో పాటు ఆయనను అనేక అవార్డులు వరించాయి. కృష్ణ ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదనరావు, కె. విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణ రావు, కె. రాఘవేంద్రరావు వంటి స్టార్ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. రమేష్ బాబు, మహేష్ బాబు.

మహేష్ బాబు తెలుగు సినీ రంగంలో తిరుగులేని హీరోగా ముందుకు వచ్చారు. కృష్ణ పద్మాలయా బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలను తీశారు. అల్లూరి సీతారామారాజు, మోసగాళ్లకు మోసగాడు, పాడి పంటలు వంటి విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు. డిటెక్టివ్ సినిమాలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు.

తెలుగు తెరకు సినిమా స్కోప్‌ను (అల్లూరి సీతారామరాజు), 70ఎంఎం మూవీని (సింహాసనం), డిటిఎస్ మూవీని (తెలుగువీర లేవరా) పరిచయం చేసింది ఆయనే. ఆయన 17 సినిమాలకు దర్సకత్వం కూడా వహించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలుగు సూపర్ స్టార్‌గా కృష్ణ చరిత్రలో నిలిచిపోతారు.

English summary
Telugu Superstar Krishna has revealed that he has planned to quit acting as well as politics. The veteran star, who has acted in more than 350 films so far, says that he is taking this decision as his health is not permitting him to do so. He regrets that he wanted to do the movie Chatrpathi Shivaji, but his dream has remained unfulfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X