విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు టైం కాదు, జగన్ బచ్చా: సర్వే సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana-Jagga Reddy
విజయవాడ/గుంటూరు: తనను రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడ్వోకేట్లను ఉపయోగించుకుంటున్నారని సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం నిప్పులు చెరిగారు. తాను తెలంగాణపై గతంలోనే తన నిర్ణయాన్ని చెప్పానన్నారు. దానికే కట్టుబడి ఉన్నానన్నారు. తాను తెలంగాణ ద్రోహినే అయితే గత ఎన్నికల్లో తనను ప్రజలు ఎలా గెలిపించారని ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కెసిఆర్ చిల్లర కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. జైల్లో ఉన్న విమలక్క గురించి తెరాస ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రేపు తనను సంగారెడ్డిలో అడ్డుకుంటే జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదన్నారు. కెసిఆర్‌కు మజ్లిస్ పార్టీని తెలంగాణపై ఒప్పించే సత్తా, ధైర్యం, దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణకు రూ.10వేల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.

సర్వే సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణ ఇచ్చే సమయం కాదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం గుంటూరులో అన్నారు. కాంగ్రెసుకు అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇస్తే తెరాస లాభపడుతుందన్నారు. తెలంగాణ కంటే సీమాంధ్రనే వెనుకబడి ఉందన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లో అమరవీరుల త్యాగం వృధా కాదన్నారు.

కాంగ్రెసు పార్టీ ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ బచ్చా అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోయాక లక్ష్మీపార్వతి సభలకు భారీగా ప్రజలు వచ్చారని గుర్తు చేశారు. జగన్ సోదరి షర్మిల సభలకు కూడా ప్రజలు అలాగే వస్తున్నారన్నారు. లక్ష్మీ పార్వతికి పట్టిన గతే వైయస్ జగన్, షర్మిలలకు పడుతుందని సర్వే ధ్వజమెత్తారు.

English summary
Central Minister Sarve Satyanarayana said on Monday that this is not time for Telangana. He was compared YSR Congress party chief YS Jaganmohan Reddy and NTR TDP president Laxmi Parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X