ఢిల్లీ రేప్: అమ్మాయి ఆరోగ్యం విషమం, రక్తస్రావం

గ్యాంగ్ రేప్‌నకు నిరసనగా సోమవారం కూడా ఢిల్లీ అట్టుడికింది. ఇండియా గేట్ వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది. నిరసన ప్రదర్శనల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గ్యాంగ్ రేప్ కేసులో వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇద్దరు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లను సస్పెండ్ చేశారు. నేరాన్ని ఎందుకు అపలేకపోయారంటూ ఇద్దరు డిసిపిలను వివరణ అడిగారు.
అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని లెఫ్టినెంట్ గవర్నర్ తేజీందర్ ఖన్నా ఢిల్లీకి చేరుకున్నారు. మహిళ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతోనూ, మహిళా సంఘాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. మోహన్ సింగ్ దబాస్ (ట్రాఫిక్), యాగ్రామ్ (పిసిఆర్) అనే ఇద్దరు ఎసిపిలను సస్పెండ్ చేశామని, ఇద్దరు డిసిపిలను వివరణ అడిగామని ఖన్నా చెప్పారు.
గ్యాంగ్ రేప్‌పై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తిన నేపథ్యంలో టెలికం మంత్రిత్వ శాఖ మూడంకెల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. మహిళలు 167 నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపింది. ప్రమాదంలో చిక్కుకున్న మహిళలను ఆదుకోవడానికి మూడంకెల హెల్ప్‌లైన్‌ను కేటాయించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ టెలికం మంత్రి కపిల్ సిబాల్‌ను కోరారు.












Click it and Unblock the Notifications