గ్యాంగ్ రేప్: నెలలో విచారణ, ఉరేయమన్న నిందితులు

Delhi Gangrape: Now, 3 accused want to be hanged
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి కేసులో జనవరి 3వ తేది నుండి విచారణ ప్రారంభమవుతుంది. ఈ కేసు విచారణను 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే అత్యాచార ఘటనలపై విచారణ నిమిత్తం ఢిల్లీలో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. ఈ కోర్టులు జనవరి 2 నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా బస్సులో గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులు తమకు ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అందులో ముగ్గురు రామ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్‌లకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. వారు ముగ్గురు తమ తప్పును మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నారు. ఐడెంటిఫికేషన్ పరేడ్‌కు వారు అంగీకరించడం లేదు. ఆరుగురు నిందితుల్లోని ముగ్గురు టెస్టు ఐడెంటిఫికేషన్ అవసరం లేదని, తాము తప్పు చేశామని అంగీకరించారు.

ప్రధాన నిందితుడు రామ్ సింగ్ సోదరుడు ముఖేష్ సింగ్, మరో నిందితుడిని బాధితులు ఇప్పటికే గుర్తించారు. మరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ బీహార్‌లో డిసెంబర్ 21న అరెస్టయ్యాడు. అతను ఐడెంటిఫికేషన్ పరేడ్‌కు అంగీకరించాడు. ఈ బుధవారం అతను పరేడ్‌కు హాజరు కానున్నాడు. అయితే మిగిలిన ముగ్గురు మాత్రం ఐడెంటిఫికేషన్ పరేడ్‌కు అంగీకరించడం లేదు. కాగా గ్యాంగ్ రేప్ ఘటనపై సోమవారం కూడా ఢిల్లీలో ఆందోళనకారులు రోడ్డెక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+