చిక్కుల్లో డిసిఎం ఈశ్వరప్ప: లోకాయుక్త సోదాలు

KS Eshwarappa
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప చిక్కుల్లో పడ్డారు. లోకాయుక్త పోలీసులు సోమవారం ఆనయ ఇంట్లో సోదాలు నిర్వహించి, 37 కిలోగ్రాముల వెండి, 1.9 కిలోగ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 10.9 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో ఆయన న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకున్నారు.

బి. వినోద్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వరప్ప నివాసంలో సోదాలు నిర్వహించాలని లోకాయుక్త కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవినీతికి పాల్పడి ఈశ్వరప్ప ఆస్తులు కూడగట్టుకుంటున్నారని ఆ న్యాయవాది ఆరోపించాడు. ఈశ్వరప్ప, ఆయన కుమారుడు కెఇ కంఠేష్, కోడులు శాలినిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇంటిలో సోదాలు జరిగిన సమయంలో ఈశ్వరప్ప ఉత్తర కర్ణాటక పర్యటనలో ఉన్నారు. లోకాయుక్త పోలీసుల సోదాలను ఆయన అహ్వానించారు. వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. అయితే, అరెస్టు భయంతో ఈశ్వరప్ప, ఆయన కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈశ్వరప్పపై తాజాగా అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే, రాజీనామా చేయడానికి ఈశ్వరప్ప నిరాకరిస్తున్నారు. కాంగ్రెసు ఒత్తిడికి తలొగ్గడానికి ఆయన సిద్ధంగా లేరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+