నరేంద్ర మోడీ స్వగ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

అహ్మదాబాద్: గుజరాత్‌లో మూడోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆయన ప్రభావం దేశవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉంటుందని బిజెపి ధీమాగా ఉండగా.. ఎక్కడ తమకు నష్టం కలిగిస్తుందోననే ఆందోళన కాంగ్రెసును వెన్నాడుతోంది. రాష్ట్రంలో బిజెపిని మూడోసారి అధికారంలోకి తీసుకు వచ్చి.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీ పుట్టిన గ్రామం కూడా ఇప్పుడు చర్చగా మారింది.

నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని మెహన్సా జిల్లా వడ్‌నగర్‌లో జన్మించారు. వడ్‌నగర్‌లో పుట్టిన మోడీ ఆ గ్రామానికి ఎప్పటి నుండో దూరంగా ఉంటున్నారు. అయితే తాను పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం ముందున్నారు. వడ్‌నగర్ మొత్తం మోడీకే ఓటేస్తారు. మోడీ తమ గ్రామానికి రాకున్నప్పటికీ ఆయన చేసిన అభివృద్ధిని ఎల్లవేళలా తల్చుకుంటారు. ముఖ్యమంత్రిగా ఇంత చేసిన మోడీ ప్రధాని అయి దేశానికి మరింత సేవ చేయాలని వడ్‌నగర్‌ గ్రామస్థులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఆయన ప్రధాని అయితే తమకు, తమ గ్రామానికి కూడా గుర్తింపు లభిస్తుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీ తాను పుట్టిన గ్రామానికి వెళ్లక నెలలు అవుతుంది. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో ఆ గ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ప్రచారం చేశారు. కానీ గ్రామానికి వెళ్లలేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నందున, ప్రచారంలో బిజీగా ఉన్నందున మోడీకి సొంత గ్రామానికి వెళ్లేందుకు సమయం చిక్కక పోవచ్చు. కానీ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం అందరికంటే ముందుండటం విశేషం!

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

నరేంద్ర మోడీ పుట్టిన వడ్‌నగర్ గ్రామం

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

చెరువు గట్టున ఉన్న థియేటర్

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామంలోని ఓ కీర్తి తోరణం

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామంలోని భవనం

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

మోడీ స్నేహితుడి ఇళ్లు

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

పాఠశాల విద్య సమయంలో మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా..

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామంలోని హటేశ్వర్ దేవాలయం. గ్రామంలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇది ఉంటుంది.

 మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

అత్యధ్భుతంగా ఉన్న షర్మిష్ట చెరువు

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

షర్మిష్ట చెరువు తూర్పు ప్రాంతంలోని సప్తర్షి స్థలం

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన చరిత్ర ఉంది.

 మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

ఆరు గేట్లు ఉన్న కోట

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామంలోని నాటి పాఠశాల

 మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామంలో వెలిసిన మొదటి లైబ్రరీ. దీనిని మెహ్తా భోగిలాల్ 1911లో నిర్మించారు.

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

గ్రామానికి 1907లో రైలు సౌకర్యం వచ్చినట్లుగా రికార్డ్స్ చెబుతున్నాయి.

 మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

షర్మిష్ట సరస్సు మరోవైపు..

మోడీ గ్రామం: మోడర్న్ అండ్ హిస్టారికల్..

వడ్‌నగర్‌లో మోడీ...

మోడీ ముఖ్యమంత్రి అయ్యాక వడ్‌నగర్‌లో ఉపాధి అవకాశాలను బాగా మెరుగుపర్చారు. ఐఐటి, పాలిటెక్నిక్‌ కళాశాలలను తీసుకు వచ్చారు. గ్రామంలో ఉన్న షర్మిష్ట చెరువును అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ పార్కు కట్టించారు. గ్రామంలో ఓపెన్ ఆడిటోరియాన్ని కట్టించారు. ఇందులో సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు జరుగుతాయి. మోడీ స్వగ్రామంలోని షర్మిష్ట చెరువుకు ఎంతో పెద్ద కథ ఉంది. మహాభారతంలోని యయాతి తన కూతురు షర్మిష్టను ఈ చెరువులో తోసేయడంతో ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

గ్రామానికి పెద్ద కథే ఉంది. వడ్‌నగర్ సోలంకి రాజుల కాలంలో గుజరాత్ రాజధానిగా వెలుగొందింది. గ్రామంలో ఇప్పటికీ కీర్తి తోరణాలు, విజయగాథలు ఉన్నాయి. గ్రామానికి ఆరు ముఖద్వారాలు ఉన్నాయి. ఊరంతా కోటలోపల ఉంటుంది. కోటలో పిరంగులు, ద్వారాలు కనిపిస్తాయి. వీధుల్లో చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. ఆధునికత, చరిత్ర మేళవించినదే మోడీ స్వగ్రామం వడ్‌నగర్. ఇది ప్రస్తుతం మున్సిపాలిటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+