గొంతు పిసికి చంపేయాలి: రేణుకా, అబ్బాస్ బైక్ ర్యాలీ

ముఖం కనబడకుండా తల నిండుగా కప్పుకోమని, ఒళ్లు కనిపించకుండా నిండుగా బట్టలు వేసుకోవాలని, చదువొద్దని, బయటకు వెళ్లొద్దని, రాత్రిళ్లు ఉద్యోగం చేయొద్దని, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తే సరిపోతుందని.. అంటూ కొంతమంది ఆడపిల్లలపై ఆంక్షలు విధిస్తుంటే, అసలు ఆడపిల్లల్ని కాపలా కాయలేమంటూ మరికొంతమంది పురిట్లోనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నైలో...
సినీనటి రోహిణి నేతృత్వంలో విద్యార్థులు అర్ధరాత్రి చెన్నయ్ మెరీనా తీరంలో ఆందోళన చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. మరోవైపు నటుడు అబ్బాస్ తీవ్రంగా స్పందించారు. తన సతీమణితో కలిసి ఆదివారం స్థానిక మెరీనా తీరంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాదులో...
నెక్లెస్ రోడ్డులో విద్యార్థులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఐమ్యాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు కొద్దిమంది పాఠశాల విద్యార్థులతో హీరో రాజశేఖర్, జీవితల ఆధ్వర్యంలో మరో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పరుచూరి గోపాలకృష్ణ, సాయి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, గాయని మధుప్రియ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఉన్నారు.
నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న విద్యార్థుల భారీ కార్యక్రమంలో కలిసేందుకు వీరు ప్రయత్నించగా రాజకీయ నాయకులు కలిసిపోయేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ ర్యాలీలో రాజకీయ నాయకులకు స్థానం లేదని విద్యార్థులు ఖరాఖండికా చెప్పేశారు. దీంతో వారి ర్యాలీని మరోచోట ముగింపచేశారు. టిడిపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు అన్ని పార్టీలు దీనిని ఖండించాయి.












Click it and Unblock the Notifications