తల్లీకూతుళ్లు అఫైర్: చంపి 17 ముక్కలు కోశారు

ఈ ఘాతుకానికి సంబంధించిన వార్తాకథనం ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. పశ్చిమ ఢిల్లీలోని కాండివ్లీకి చెందిన ముక్తి షా మృతదేహం గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో డిసెంబర్ 12వ తేదీన వెలుగు చూసింది. ఈ హత్య కేసులో 52 ఏళ్ల మహిళను, ఆమె 30 ఏళ్ల కూతురిని ఆనంద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారు తమ నేరాన్ని అంగీకరించారు.
అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా వసద్ గ్రామం వద్ద షా హత్యకు గురయ్యాడు. స్థానిక క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారంనాడు 17 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీని స్వాధీనం చేసుకున్ారు ఇది వారికి నవీ ముంబైలోని పాన్వెల్‌లో పోలీసులకు చిక్కింది. నిందితులు చదువుకున్నవారని, మొబిలిటీ ఉన్న మహిళలని స్థానిక క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌డి దభీ చెప్పారు.
కూతురు ఫ్యాషన్ డిజైనర్. తన పేరు మీద పవర్ అటార్నీని షా చేత రాయించుకోవడానికి ఆమె ఆరు నెలల క్రితం పథకం రచించి, ఫలితం సాధించింది. తల్లీకూతుళ్లు కలిసి ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన కేసు ఇదే మొదటిదని పోలీసులు అంటున్నారు. షా కారులో కూరగాయలు, దుపట్టా ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌ను చూసిన ఆనంద్ పోలీసు సూపరింటిండెంట్ హత్య కేసులో మొదటి క్లూ రాబట్టారు.
ఆనంద్ పోలీసులు కాల్ డేటా కోసం అహ్మదాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ ఇద్దరు మహిళలకు తరుచుగా ఫోన్‌లు చేసినట్లు తెలియడంతో విచారణ నిమిత్తం వారిని అదుపులోకి తీసుకున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్న తర్వాత తల్లీకూతుళ్లు కలిసి షాను హత్య చేయడానికి పథకం రచించారు. అంతకు ముందు రెండుసార్లు అతన్ని చంపడానికి తల్లీకూతుళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. మూడో సారి మాత్రం షా తప్పించుకోలేకపోయాడు.












Click it and Unblock the Notifications