వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గెలిస్తే అణచేస్తాడట, పాతమన్ను కదలదు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిస్తే తెలంగాణను అణగదొక్కుతాడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కాంగ్రెస్ మాత్రం అఖిలపక్ష సమావేశాలతో కాలయాపన చేస్తోందని, చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నాడని, చంద్రబాబు ప్రజలు నమ్మరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఈ మూడు పార్టీలను బొంద పెట్టాలని, అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పకపోతే ఈ పార్టీల నేతలను ఇక దంచాలని ఆయన హెచ్చరించారు.

తెలంగాణపై 28న జరిగే అఖిలపక్ష భేటీతో గోల్‌మాల్ కావొద్దని, గందరగోళ పడొద్దని, అందులో బ్రహ్మ పదార్థమేమీ లేదని ఆయన అన్నారు. ''నూరు శాతం గ్యారంటీ ఇస్తున్నా... ఏ పాతమన్నూ కదలదు. చాట్ల తవుడు పోసి మళ్లీ కొట్లాట పెడుతున్నరు. దీంతో ఒరిగేదేమీ లేదు'' అని కెసిఆర్ అన్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించి మాట్లాడారు.

చాలా గూఢచారి సంస్థలు లేవని, ఏం జరుగుతుందో కేంద్రానికి తెలుస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ''సీఎం ఢిల్లీకి వెళ్లి వచ్చిండు. ఎందుకు వెళ్లాడు. ఏం బలుపా? ఉద్యమానికి ప్రాధాన్యం లేదట. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు మనల్ని ఆడిస్తుండ్రు. అఖిలపక్షంతో బెత్తిరీన్‌గా ఒక ఉపయోగం జరగబోతుంది. అన్ని పార్టీల రంగులు బయటపడతాయి'' అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినట్లే ఇచ్చి ఎండబెట్టిందని, మరో పార్టీ (టీడీపీ) రాత్రికి రాత్రి రాజీనామాల డ్రామా ఆడి అడ్డుకుందని, పార్లమెంటులోనే సమైక్యాంధ్ర జెండా పట్టుకుని జగన్ అడ్డుపడ్డాడని, వీళ్ల సంగతులు తెలియనివెవరికని మండిపడ్డారు. ఇంకా అఖిలపక్షమంటూ ఎవరిని మభ్యపెట్టడానికంటూ ధ్వజమెత్తారు. "డిసెంబర్ 23 ప్రకటన తర్వాత అదే రాత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లా. కిషన్‌రెడ్డిని, టీడీపీ నేతలను రప్పించా. అందరం రాజీనామా చేద్దామని చెప్పా. ఒకడు మీసాలు మెలేసిండు, మరొకడు తొడకొట్టిండు. తర్వాత ఎవడూ పత్తాలేడు. వచ్చిన తెలంగాణ మాయమైంది. ఎంతో మంది విద్యార్థులు చనిపోయిండ్రు. కేసీఆర్ చావడు, ఉద్యమాన్ని చావనివ్వడంటూ పార్టీలు ఆందోళన చెందాయి. కానీ, ఉద్యమాన్ని సాగిస్తూనే వస్తున్నాం. ఇదే మా వ్యూహం'' అని ఆయన అన్నారు..

నో ఆప్షన్. నో ఆల్టర్‌నేట్. నో కాంప్రమైజ్. భర్తృహరి చెప్పినట్లు... మనం నీచ మానవులమో, మధ్యములమో, ధీరువులమో తేల్చుకోవాలి. పిడికిలి బిగించి ముందుకు వెళదాం. సందర్భం వచ్చినప్పుడు అందరం ఐక్యమవుదాం. శషభిషలు వద్దు. మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ ముట్టడికి లక్షలాదిగా తరలివస్తరు. తడాఖా చూపిస్తం'' అని హెచ్చరించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has blamed Congress on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X