వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు మచ్చ తెచ్చినట్లే: బాలయ్యపై నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Balakrishna - Narayana
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి హీరో బాలకృష్ణ మచ్చ తెచ్చినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గాంధీనగర్ వెళ్తే లౌకికవాదాన్ని బలపరుస్తున్న చంద్రబాబుకు మచ్చ తెచ్చినట్లేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బాలకృష్ణకు నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని కాంగ్రెసు పార్టీ తేలిగ్గా తీసుకుంటోందని ఆయన విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి ఎందరు వెళ్లినా తెలంగాణపై ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు నుంచి అఖిల పక్ష సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వస్తారా, ఎవరు వస్తారనేది ముఖ్యం కాదని, ఎవరు వచ్చిన కాంగ్రెసు తరఫున ఒకే అభిప్రాయం వెల్లడించాలని ఆయన అన్నారు.

తెలంగాణపై ఒకే అభిప్రాయం చెప్పకపోతే కాంగ్రెసు సంగతి చూసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం విషయంలో కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేకున్నా తమకు ఉందని ఆయన అన్నారు. సమైక్యవాదులకు కాంగ్రెసు అధిష్టానం మద్దతు ఉందని ఆయన అన్నారు. ఆర్టీసిలో టిఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం శుభసూచకమని ఆయన అన్నారు.

ఢిల్లీ సంఘటనపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. ఆందోళనకారులను ఎన్‌కౌంటర్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తులుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary

 CPI secretary K Narayana said that it is a blot on Telugudesam president N Chandrababu Naidu, if Nansamuri hero Balakrishna attends Narendra Modi's searing - in ceremony at Gandhinagar of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X