ఏంచేద్దాం, ఎవర్నిపంపిద్దాం?: బొత్స, బాబు తర్జన భర్జన

ఆయన అక్కడే సీమాంధ్ర ప్రాంత నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంపై చర్చిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు టిడిపిలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పంపినట్లుగానే యనమల రామకృష్ణుడు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలని పంపే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎవరు వెళ్లినా... ఏ ప్రాంతం వారు వెళ్లినా ఏం చెప్పాలనే అంశంపై జోరుగా చర్చిస్తున్నారు. అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఏం చెప్పాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి. వ్యతిరేకంగా లేమని చెబితే తెలంగాణ ఐకాస సంతృప్తి పడే అవకాశాలు లేవు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ హైదరాబాదులో ఇరు ప్రాంతాల మంత్రులు సమావేశమయ్యారు. మంత్రులు సునీతా లక్ష్మా రెడ్డి, శత్రుచర్ల విజయ రామరాజు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, కేంద్రమంత్రులు బలరాం నాయక్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులతో కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటీ అయ్యారు. అఖిల పక్ష సమావేశంపై చర్చిస్తున్నారు.
గత అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ నుండి సీమాంధ్ర నుండి ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు, తెలంగాణ నుండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వెళ్లారు. కావూరి పార్టీ పట్ల అసంతృప్తితో ఉండటం, ఉత్తమ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో వేరే ఇద్దర్ని ఎవరిని పంపించాలా అనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ తలమనకలై ఉంది.












Click it and Unblock the Notifications