సమైక్యాంధ్ర ఉద్యమం: కావూరికి లగడపాటి తోడు

తాజాగా, నెల్లూరలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి సమావేశంలో కూడా ఆయన అదే విమర్శ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని కూడా తప్పు పట్టారు. కెసిఆర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదని ఆయన అన్నారు.
కేంద్రంలో సమర్థమైన ప్రభుత్వం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే రాష్ట్రం అధ్వాన్నంగా మారిపోతుందని ఆయన అన్నారు. కాలయాపన కోసమే అఖిల పక్ష సమావేశమని కావూరి అన్నారు. తెలంగాణ వేర్పాటాువాదం వ్యాపారం లాంటిదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులే పెట్టుబి ఆయన అన్నారు.
ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశం తర్వాత కేంద్రం నుంచి సమైక్యాంధ్ర ప్రకటనే వెలువడుతుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. తెలంగాణ విద్యార్థుల మాదిరిగా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే సమైక్యాంధ్ర ఉద్యమ నేతలే చేసుకుంటారని ఆయన అన్నారు.
తెలంగాణవాదం పేరుతో కెసిఆర్ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర వాదం నాయకులు ప్రాణత్యాగానికి కూడా సిద్ధ ఉన్నారని ఆయన చెప్పారు. మూడు ప్రాంతాల్లో పోటీ చేసే పార్టీలకే 270 సీట్లు వస్తాయని ఆయన అన్నారు. ఉద్యోగులను, విద్యార్థులను ప్రలోభ పెట్టేలా కెసిఆర్ వ్యాఖ్యలున్నాయని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం తేదీని ప్రకటించినప్పటి నుంచి కావూరి సాంబశివరావు సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సమైక్యాంధ్ర విద్యార్ధి జెఎసి సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు. కెసిఆర్‌పై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆయన ఆ స్వేచ్ఛను పొందినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications