ఆల్‌పార్టీకి సిఎం: తెలంగాణకి ఓకే కానీ: సీమాంధ్ర టిడిపి

రేపు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. తెలుగు మహా సభల ప్రారంభం అనంతరం కిరణ్ నేరుగా బెంగళూరు మీదుగా ఢిల్లీకి పయనం కానున్నారు. శుక్రవారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను కేంద్ర హోంశాఖ మంత్రి ఆహ్వానించిన విషయం తెలిసిందే. పార్టీలు ఎవరిని పంపాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి.
తెలంగాణకు ఒకే కానీ...
తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని అయితే నిర్ణయంతో సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే పరిణామాలను పరిగణలోకి తీసుకోవాలని అధినేతను కోరారు. భేటీలో 2008లో అప్పటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ అంశం ప్రస్తావనకు వచ్చింది.
టిడిపి అప్పుడే లేఖ ఇచ్చిందని దానికే తాము కట్టుబడి ఉన్నామని అఖిల పక్ష సమావేశంలో చెప్పాలని కొందరు నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖను వెనక్కి తీసుకోలేదని దానికే తాము కట్టుబడి ఉన్నామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని భేటీలో చెప్పాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అనంతరం యనమల మాట్లాడుతూ... భేటీకి ఎవరు వెళ్లినా ఒకే అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నామని, రేపటి పోలిట్ బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications