ఇద్దరు బిజినెస్ చేశారు: ఎసిబి, స్పందించిన సూరీడు

ఎనిమిది బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నామని, రిపుంజయ రెడ్డికి సంబంధించి ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయన్నారు. ఐదుచోట్ల బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందన్నారు. తార్నాక, హకీంపేట, కొండాపూర్, రాజేంద్రనగర్, కడపలలో ఇళ్లు ఉన్నట్లుగా తేలిందన్నారు. కడపలో 36 ఏకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కనుగొన్నట్లు చెప్పారు. అరకిలో బంగారం, లాకర్‌లో రూ.30 లక్షల నగదును గుర్తించినట్లు చెప్పారు.
కొండాపూర్‌లో 600 గజాల స్థలం ఉన్నట్లు తేలిందని, 2008 నుంచి రిపుంజయ రెడ్డి ఆస్తులు సంపాదిస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. కాగా అయ్యప్ప సొసైటీలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరూర్ వైశ్య బ్యాంకులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా సమాచారం. వెంకటగిరిలో ఒకే అపార్టులమెంటులో ఆరు ప్లాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. రిపుంజయ రెడ్డి, సూరీడు ఇళ్లలో నుండి కీలక పత్రాలు ఎసిబి స్వాధీనం చేసుకున్నారు. ఓ సమయంలో రిపుంజయ రెడ్డికి ఎసిబి అధికారులకు మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.
కాగా ఎసిబి సోదాలపై సూరీడు స్పందించారు. రిపుంజయ రెడ్డి, తాను కలిసి వ్యాపారాలు చేసినట్లుగా చెప్పారు. అతని ఆస్తులకు సంబంధించిన పత్రాలు తన ఇంట్లో ఉన్నాయనే అనుమానంతోనే ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సూరీడు చెప్పారు.












Click it and Unblock the Notifications