స్టేట్ విడిపోవాలనుకోను: బొత్స, భిన్నాభిప్రాయాలు: జెసి

అంతకుముందు ఆయన తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉన్నా అభ్యంతరం లేదన్నారు. రెండు రాష్ట్రాలు ఉంటే మంచిదే కదా అని ఆయన అన్నారు. ఒకటిగా ఉన్నా... విడిపోయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నారు.
పార్టీలో భిన్నాభిప్రాయాలు
తెలంగాణపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై తేల్చాల్సింది కాంగ్రెసు పార్టీ కాదని కేంద్ర ప్రభుత్వం అన్నారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరెవరిని భేటీకి పంపిస్తుందో తనకు తెలియదన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా దీనిపై స్పష్టత రావొచ్చునని తెలిపారు.
విభజనపై అభ్యంతరం లేదు
రాష్ట్ర విభజనపై తమకు అభ్యంతరం లేదని అయితే నీటి కేటాయింపులు, ఇతర డిమాండ్లు తీర్చాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. త్వరలో సీమాంధ్ర నేతలతో దీనిపై చర్చిస్తామన్నారు. ఒక్కటిగా ఉంచాలా లేదా తమ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూడాలా అనే అంశంపై మాట్లాడుతామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలను అభినందిస్తున్నామన్నారు.
విడగొట్టవద్దని కోరుతాం
రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఆయా పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తామని విశాలాంధ్ర సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు.












Click it and Unblock the Notifications