ఢిల్లీ గ్యాంగ్‌రేప్: కానిస్టేబుల్ సుభాష్ మృతిలో కొత్త ట్విస్ట్

Subhash Tomar
న్యూఢిల్లీ: ఢిల్లీలో వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్‌నకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలో ఇండియా గేట్ వద్ద గాయపడిన కానిస్టేబుల్ సుభాష్ తోమర్ మృతిపై వైద్యులు బుధవారం పోస్టుమార్టం నివేదికను వెల్లడించారు. మృతి చెందిన కానిస్టేబుల్ శరీరం పైన ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టంలో తేలిందని వైద్యులు తెలిపారు. అతని బాడీ పైన చిన్న చిన్న గాయాలు మినహా ఎలాంటి పెద్ద గాయాలు లేవని చెప్పారు. కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని వైద్యులు అభిప్రాయపడ్డారు.

కాగా గ్యాంగ్ రేప్‌నకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలో ఇండియా గేట్ వద్ద గాయపడిన కానిస్టేబుల్ సుభాష్ తోమర్ మరణించిన విషయం తెలిసిందే. ఆదివారంనాడు జరిగిన ఘర్షణల్లో అతను గాయపడ్డాడు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం ఉదయం మరణించాడు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన ఆదివారం నాడు హింసాత్మకంగా మారింది.

పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను గాయపరిచినవారికి సంబంధించిన వీడియో క్లిప్ తమ వద్ద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనను హత్యా కేసు కింద పరిగణిస్తారు. ఆందోళనకారులపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. డిమాండ్లకు ఓ పరిమితి ఉంటుందని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అప్పుడే మండిపడ్డారు.

ఇండియా గేట్ వద్ద ఆదివారం ఆందోళనకారులపై పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన సమర్థించారు. కానిస్టేబుల్ మృతికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి సంబంధం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+