సమైక్యాంధ్రకే మద్దతు, తెలంగాణను గౌరవిస్తా: డిఎల్

DL Ravindra Reddy
గుంటూరు/ హైదరాబాద్: తెలంగాణ ప్రజల మనోభావాలను తాను గౌరవిస్తానని, తెలుగు మాట్లాడే వారందరూ ఒకే రాష్ట్రంలో కలిసి ఉంటే తప్పులేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు చెప్పిన విధంగా తాను సమైక్యాంధ్రకే సంపూర్ణ మద్దతు తెలుపుతానని, కానీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానని చెప్పారు.

గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ కు అనుకూలమా, ప్రతికూలమా అన్నది తేల్చి చెప్పాలన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏదో జరిగిపోతుందని ఊహించనవసరం లేదు, కేవలం అఖిలపక్షమనేది అవగాహన కోసమేనని అని చెప్పారు.

అఖిలపక్ష సమావేశం ఉద్యమంలో ఆఖరి పోరాటమని, ఆలోపే కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణకు అనుకూల వైఖరిని ప్రకటించాలని తెలంగాణ నగరా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేసారు. లేనిపక్షంలో 29 నుంచి తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో ఆ పార్టీల జెండాలను, జెండా దిమ్మెలను ధ్వంసం చేయక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాగం చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ప్రారంభమయింది.

తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి రావాలని నాగం పిలుపు ఇచ్చారు. హోంమంత్రి సబితారెడ్డి నియోజక వర్గమైన మహేశ్వరం నుంచే పిలుపు ఇస్తున్నామన్నారు. సబితారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే మీకు పదవులే ముఖ్యమా అని నాగం మండిపడ్డారు. ఇక నుంచి ఆంధ్ర మంత్రుల పెత్తనం సాగనివ్వవద్దని, అందుకు తెలంగాణవాదుల ఐక్య పోరాటాలే ముఖ్యమని ఆయన అన్నారు.

ఇకపై తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలకు పాల్పడనవసరం లేదని, బతికి సాధించుకుందామని నాగం పిలుపు ఇచ్చారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ వాదులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+