వెళ్లాలి కాబట్టి వెళ్తున్నాం: కెసిఆర్, జగ్గారెడ్డి, జగన్‌పై ఫైర్

అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పినా చెప్పకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. గతంలో వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబే అని ఆరోపించారు. తనపై నిత్యం విమర్శలు చేసే సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) మూర్ఖుడు, పిచ్చోడని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నారన్నారు.
అఖిల పక్షం పేరుతో కాంగ్రెసు పార్టీ కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. ఎఫ్‌డిఐల అంశంలో తెలంగాణ కాంగ్రెసు ఎంపీల కోసమే అఖిల పక్ష సమావేశం అని ఆరోపించారు. తెలంగాణ ఇవ్వాలనుకుంటే అఖిల పక్షం అవసరమే లేదన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే వెంటనే తెలంగాణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇవ్వాలని ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదన్నారు.
ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. మూడేళ్లుగా తెలంగాణ అంశాన్ని నాన్చుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను తెలంగాణవాదాన్ని దెబ్బతీసేందుకే పంపిస్తున్నారన్నారు. అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ బలహీనులను ఎంపిక చేస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ దివాళాకోరుతనం బయటపడిందన్నారు. తెలంగాణలో ఓట్ల కోసమే జగన్ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు.
అఖిల పక్షం కాదు నకిలీ పక్షం
తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నకిలీ పక్షమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ఇండియా గేట్ దగ్గర ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన తెలంగాణలో చూస్తారన్నారు. పదవులు త్యాగం చేసిన ఘనత కెసిఆర్‌ది, తెరాసదే అన్నారు. కాంగ్రెసు నేతలు పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. తమ పదవులే తెలంగాణకు అడ్డు అయితే వాటిని త్యజిస్తామన్నారు. మోసం చేసేందుకే ఈ వెకిలి పక్షం అన్నారు. టిడిపి తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications