సీల్డ్‌కవర్లో చెప్తాం, నిలదీస్తాం:ఆల్‌పార్టీకి శ్రీహరి, యనమల

సీమాంధ్ర నేత ప్రతినిధిగా యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుండి కడియం శ్రీహరిలు అఖిల పక్ష సమావేశానికి వెళ్లనున్నారు. తాము కొన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించామని యనమల చెప్పారు. తామిద్దరం ఒకే అభిప్రాయాన్ని చెప్తామని, అదే సమావేశంలో కాంగ్రెసు పార్టీ వైఖరిపై తాము నిలదీస్తామన్నారు. తమ పార్టీ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ రూపంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందజేస్తామన్నారు.
2008లో రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఆ లేఖను వెనక్కి తీసుకోలేదన్నారు. అఖిల పక్ష సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెసు అభిప్రాయం చెప్పకుంటే అన్ని పార్టీలు నిలదీయాలన్నారు. భేటీలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. లేఖ రూపంలోనే తాము అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. సమావేశం తర్వాత లేఖను మీడియా ముందు ఉంచుతామని చెప్పారు.
ఢిల్లీ బయలుదేరిన కెసిఆర్, నాయిని
అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తమ అభిప్రాయం వెల్లడించేందుకు పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాదు నుండి ఢిల్లీకి బయలుదేరారు.












Click it and Unblock the Notifications