కాంగ్రెసుకు షాక్: వైయస్ జగన్ పార్టీలోకి బాలరాజు

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు పాడేరు మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు ఎస్వీవి రమణమూర్తి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు ఇంచార్జీ కుంబా రవిబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు భగత తెగకు చెందినవారు. పాడేరు శాసనసభా నియోజకవర్గం ఆ తెగ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. మాజీ మంత్రి ఎం మణికుమారి భర్త ఎం వెంకటరాజు సోదరుడు ఆయన. వెంకటరాజు మావోయిస్టులో దాడిలో మరణించారు.
బాలరాజు కాంగ్రెసు నుంచి వెళ్లిపోవడం వల్ల తమకే నష్టం లేదని, బాలరాజు కొన్నేళ్లుగా క్రియాశీలకంగా లేరని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్ద యెత్తున ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే బాలరాజును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications